Saturday, May 18, 2024

TS | వామ్మో కొండచిలువ.. వలకు చిక్కింది

నిజామాబాద్ జిల్లా, బాల్కొండ (ప్రభ న్యూస్) : ముప్కాల్ గ్రామంలోని నిర్మాణ ద‌శ‌లో ఉన్న‌ ఇంటిలో ఓ కొండ చిలువ క‌నిపించింది. వలలో చిక్కుకొని ఉన్న 10 అడుగుల పైథాన్ ను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ముప్కాల్‌ ఎస్సై భాస్కరాచారి, ఫారెస్ట్‌ సెక్షన్‌ అధికారి గణేష్‌, బీట్‌ అధికారి సురేష్‌ తమ సిబ్బందితో వచ్చి పామును రక్షించి అడవిలో వదిలేశారు. జనావాసాల్లో వన్యప్రాణులు కనిపిస్తే నిర్భయంగా తెలియజేయాలని అధికారులు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement