Wednesday, May 8, 2024

రైతు ఆత్మ హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే – రవళి రెడ్డి

టీపీసీసీ అధికార ప్రతినిధి రవళి రెడ్డి, జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి ఈ రోజు ములుగు మండలం లోని రామ చంద్ర పూర్,గుర్తురు తండా,కొడిషల కుంట గ్రామాలలో రైతు డిక్లరేషన్ రచ్చ బండ కార్యక్రమం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు.. ఈ సందర్భంగా టిపిసిసి అధికార ప్రతినిధి రవళి రెడ్డి జిల్లా అధ్యక్షులు.. నల్లెల కుమారస్వామి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీనీ ఆదరించండి.. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో రైతులకు కెసిఆర్ చేసింది ఏమి లేదని, ఎన్నికల సమయంలో ఏక కాలములో రైతు రుణమాఫీ చేస్తా అని, పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తా అని, రైతులకు ఎరువులు ..విత్తనాలు ఉచితంగా ఇస్తానని దొంగ హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చిన కెసిఆర్ .. వరి వేస్తే ఉరి అనే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని, రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చిన ఎవుసం బాగుపడ్డ చరిత్ర లేదన్నారు.
రైతులకు ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ, పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇలా అనేక సంక్షేమ పథకాలు అందించిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించాలి అని, అసమర్థ బీజేపీ మరియు తెరాస పార్టీల పాలనకు చరమ గీతం పాడాలని రైతులను ఉద్దేశించి మాట్లాడారు..ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,మండల పార్టీ అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా..సహకార సంఘం చైర్మన్ బొక్క సత్తి రెడ్డి,కిసాన్ సెల్ మండల అధ్యక్షులు వాకిటి రామకృష్ణ రెడ్డి, వంచ రామ్మోహన్ రెడ్డి,మాజీ ఎంపీపీ ఆంకుస్..గ్రామ కమిటీ అధ్యక్షులు
ముల రవీందర్ రెడ్డి,జోషి, బేతి రాజీ రెడ్డి,వీరన్న,ధన్య, హట్కర్ స్వామీసురేష్,మోహన్,ప్రతాప్, లక్ పతి,బాలరాజు,బాలాజీ,
ప్రతాప్ రెడ్డి, రాము,నేరెళ్ళ కుమారస్వామి,వాకిటి మోహన్ రెడ్డి,భూక్యా నర్సింహ, భౌ సింగ్విజేందర్,సురేష్,బాలాజీ, మైబు సింగ్,మోహన్,బుపతి రెడ్డి, యాది రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement