Saturday, April 27, 2024

TS : జిహెచ్ఎంసి కార్మికులతో కలిసి…. ఉప్పల శ్రీనివాస్ గుప్త హోలీ సంబ‌రాలు…

అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త జిహెచ్ఎంసీ కార్మికుల‌తో క‌లిసి హోలీ జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అంద‌రికీ హోలీ శుభాకాంక్ష‌లు తెలిపారు. అనంత‌రం పండుగ కానుక‌ల‌ను అంద‌జేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు అందరికీ హోళీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నిత్య జీవనంలోని కష్టాలను కాసేపు మరిచి, వయోభేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలు కలిసి,మెలిసి కేరింతలతో ఆనందోత్సాహాల నడుమ రంగులతో జరుపుకునే ప్రకృతి పండుగ హోలీ అని అన్నారు. సహజసిద్ధమైన రంగులతో మాత్రమే ఈ హోళీ సంబరాలు చేసుకోవాలని, ఈ రంగుల పండుగతో మీ జీవితం సంబరాలమయం కావాలని కోరుకుంటూ… ప్రజలంతా అనందోత్సాహాలతో,సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement