Wednesday, May 8, 2024

ఆ వార్త‌ల్లో నిజం లేదు.. టీఆర్‌ఎస్‌లోనే సైనికుడిలా పనిచేస్తా: వేణుగోపాలచారి

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ : మీడియాలో తనపై వస్తున్న వార్తాలు నిరాధారం అని , తాను బీజేపీ పార్టీలో చేరుతున్నానని ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ని కలిశానని వచ్చిన వార్తలు పూర్తి నిరాధారమైనవి అని టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి అన్నారు. ఇలాంటి వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాను అని ఇలాంటి అవాస్తవం ,కట్టు కథలు, కల్పిత వార్తలు ప్రచురితం చేస్తున్న వారి పై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు రోజులుగా నేను వ్యక్తిగత పనుల మీద పాండిచేరి చెన్నైకి వెళ్లానని దీంతో లేని పోనివి ఊ#హంచుకుంటూ అవస్తవాలు ప్రచురితం చేయడం ఎంతవరకు సమంజసం అని , మారిన రాజకీయ సమీకరణాల ప్రకారం నా పార్లమెంట్‌ పరిధి రీజర్వడ్‌ కావడం వల్ల గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్‌ గారు నన్ను గుర్తించి కేబినెట్ హోదాలో ఢిల్లిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక ప్రతినిధిగా నియమించారని తెలిపారు.

అదేవిధంగా సీఎం కేసీఆర్‌ తో నాకు దశాబ్దాల అనుబంధం ఉంది అని, అత్యంత సన్నిహితంగా ఉంటానని, ఒక కుటుంబ సభ్యునిగా చూసుకుంటారని , నాకు సముచిత స్థానం కలిపించారు అని తెరాస పార్టీలో నాకు ఎంతో గౌరవం ఉంది అని, తెరాస పార్టీ పరంగా, కుటుంబ పరంగా ,జిల్లాలో నేతలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి అని, నాకు ఎంతో గౌరవం ఇచ్చి ఆదరించిన తెరాస పార్టీ ని వీడి ఇంకో పార్టీ వైపు ఎందుకు చూస్తాను, నాకు అటువంటి అవసరం లేదు గౌరవ కేసీఆర్‌ నాయకత్వంలో పార్టీ కోసం ఒక సిపాయిల గా పనిచేస్తాను తప్ప పక్క పార్టీల వైపు చూసే మనస్తత్వం నాది కాదని వేణుగోపాలచారి స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement