Monday, May 27, 2024

తుంతుంగ బ్రిడ్జితో తొలగిన ఇబ్బందులు.. ఆనందంలో చెన్నూరు ప్రజలు

చెన్నూరు ప్రజల చిరకాల వాంఛ తుంతుంగ బ్రిడ్జి ఇటీవల నిర్మాణం పూర్తయి ప్రారంభించడంతో దశాబ్దాల కాలంగా నెలకొన్న సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. వాన కాలం వస్తే చాలు బ్రిడ్జి లేక రవాణా సౌకర్యం నిలిచిపోవడంతో చెన్నూరు మండల ప్రజలు నానా ఇబ్బందులు పడేవారు. దశాబ్దాల కాలంగా పాలకులు బ్రిడ్జి నిర్మాణం పై ప్రతి ఎన్నికలో హామీ ఇచ్చి నిర్మాణం మరిచిపోవడంతో ప్రజలు ప్రతి ఏడాది రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారు. చెన్నూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన బాల్క సుమన్ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేయించారు.

యుద్ధ ప్రాతిపదికన బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయించడంతోపాటు ఇటీవల మంత్రి ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడంతో దశాబ్దాల చెన్నూరు ప్రజల ఆకాంక్ష నెరవేరడం తో పాటు బ్రిడ్జిపై రాకపోకలు ప్రారంభమయ్యాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో బ్రిడ్జి కింద వరదనీరులో చిన్నారులు ఈత కొడుతుండగా మత్స్యకారులు చేపలు పడుతున్న దృశ్యాలు ప్రజలను ఆకర్షించాయి. గత పాలకులు విస్మరించిన తుంతుంగ గా బ్రిడ్జ్ ను సకాలంలో పూర్తి చేయించి రవాణా సమస్యను శాశ్వతంగా పరిష్కరించిన ఎమ్మెల్యే బాల్క సుమన్ కు మండల ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement