Friday, June 14, 2024

AP : రోడ్డు ప్ర‌మాదాల పై చంద్ర‌బాబు ద్రిగ్భాంతి

ఏపీలో ఇవాళ వేర్వేరుగా జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదాల్లో 10మంది మృతి చెందారు. ఈ ప్ర‌మాదాల‌పై టీడీపీ ఛీఫ్ చంద్ర‌బాబు ద్రిగ్భాంతి వ్య‌క్తం చేశారు. తిరుపతి జిల్లా ఎం.కొంగవరం, కృష్ణాజిల్లా కోడూరుపాడు, కాకినాడ జిల్లా రాయవరం వద్ద జరిగిన ప్రమాదాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదాలు జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని చంద్రబాబు కోరారు. మృతుల కుటుంబాలకు చంద్రబాబు నాయుడు తన సంతాపాన్ని ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement