Monday, June 17, 2024

SRH : కావ్యా మార‌న్‌కు అబితాబ్ ఊర‌డింపు..

ఐపీఎల్ ఫైనల్స్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి అభిమానులను నిరాశకు గురిచేసింది. ఇక తన టీం ఓటమితో కావ్య మారన్ కన్నీంటిపర్యంతమైన తీరు చూసి క్రికెట్ అభిమానులందరూ చలించిపోయారు. చివరకు బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ను కూడా కావ్య మారన్ కన్నీరు కదిలించింది. ఎస్ఆర్‌హెచ్ ఓటమి తరువాత బిగ్ బీ నెట్టింట ఓ పోస్ట్ చేశారు.

- Advertisement -

‘‘ఐపీఎల్ అయిపోయింది. కేకేఆర్ తిరుగులేని విజయం సాధించింది. ఎస్‌ఆర్‌హెచ్‌కు అసలు అవకాశమే లేకుండా పోయింది. ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి అనేక రకాలుగా విచారం కలిగిస్తోంది. గత మ్యాచ్‌ల్లో ఎస్ఆర్‌‌హెచ్ అద్భుత ప్రదర్శన చేసింది. అయితే, ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి కంటే కావ్య మారన్ నుంచి మరింత ఆవేదన చెందాను. తన టీం ఓటమి తరువాత ఆమె కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. చివరకు కెమెరా కంట పడకుండా కన్నీళ్లు తుడుచుకుంది. ఆమె పరిస్థితి చూసి చాలా బాధ కలిగింది. అయితే, రేపటి రోజుకు మళ్లీ నూతనోత్సాహంతో మొదలుపెట్టాలి’’ అని అబితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement