Monday, June 17, 2024

TS : కొనసాగుతున్న గ్రాడ్యుయేట్స్ పోలింగ్…. ఓటు వేసిన ప్ర‌ముఖులు

వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పట్టభద్రులంతా కేంద్రాల వద్ద బారులు తీరారు. కాగా, ప్ర‌ముఖులు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. 52 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్వో)గా నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన వ్యవహరిస్తున్నారు.

- Advertisement -

ఓటు వేసిన ప్ర‌ముఖులు….
ఈ ఎన్నిక‌ల‌లో వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సూర్యాపేటలోని జూనియర్‌ కళాశాలలో భారాస నేత, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఓటు వేశారు.

భువనగిరి జిల్లా తుర్కపల్లిలో కాంగ్రెస్ అభ్య‌ర్ధి తీన్మార్ మల్లన్న దంపతులు , హన్మకొండలో బిఆర్ఎస్ అభ్య‌ర్ధి ఏనుగుల రాకేశ్ రెడ్డి దంపతులు , ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్‌, నల్లగొండ పట్టణంలోని డైట్ కళాశాలలో న‌ల్గొండ‌ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన , హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్.

వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆయా జిల్లా కేంద్రాల‌లో త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement