Monday, May 6, 2024

Spl Story: సినీ లవర్స్​కి పండుగే పండుగ.. ఒకేసారి రిలీజ్ కానున్న నాలుగు అతిపెద్ద సినిమాలు!​

సినిమా-ప్రేక్షకులకు పండుగే పండుగ.. సంక్రాతి, దీపావళి, దసరా, రంజాన్​, క్రిస్మస్​ ఇట్లా అన్ని పండుగలు కలిసి ఒక్కసారి వస్తే ఎట్లుంటుందో ఊహించారా? అవును అట్లాంటి సంబురం అతిపెద్ద సనిమాల రిలీజ్​ ద్వారా రాబోతోంది.. సినీ లవర్స్​కి గొప్ప అనుభూతిని కలిగించడానికి నాలుగు అతిపెద్ద సినిమాలు పెద్ద స్క్రీన్‌పై అలరించేందుకు రెడీ అవుతున్నాయి.

అందులో 1) బ్రహ్మాస్త్ర పార్ట్ వన్: శివ.. 2) షంషేరా, 3) అవతార్: ది వే ఆఫ్ వాటర్ 4) థోర్: లవ్ అండ్ థండర్‌.. క్రిస్ హెమ్స్ వర్త్, నటాలీ పోర్ట్ మన్ నటించిన ఈ ​ మూవీ దేశంలోని 3D, 2D స్క్రీన్‌లలో విడుదల కానుంది. ఇక.. భారత అభిమానులకు ట్రిపుల్ ట్రీట్అంటూ..  బ్రహ్మాస్త్ర ట్రైలర్, ‘థోర్’.. అవతార్ టీజర్” జత చేస్తూ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

బ్రహ్మాస్త్రా పార్ట్ వన్: శివ.. దీనికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ధర్మ ప్రొడక్షన్స్ మద్దతుతో అలియా భట్, రణబీర్ కపూర్ నటించనున్నారు. మౌని రాయ్, నాగార్జున అక్కినేని, అమితాబ్ బచ్చన్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో ఉండబోతున్నారు. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మాణ సంస్థలుగా వ్యవహరిస్తున్నాయి.

‘బ్రహ్మాస్త్ర పార్ట్ వన్: శివ’ సెప్టెంబర్ 9న థియేటర్లలోకి రానుంది. హిందీలో కూడా ఈ మూవీ అందుబాటులో ఉంటుంది. బాహుబలి, RRR చిత్రాల దర్శకుడు SS రాజమౌళి ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం వంటి నాలుగు దక్షిణాది భాషలలో అందించారు. యశ్ రాజ్ ఫిలింస్ మద్దతుతో రణ్‌బీర్ కపూర్ నటించిన మరో చిత్రం ‘షంషేరా’ కూడా థోర్ కంటే ముందు ట్రైలర్‌లను రిలీజ్​ చేసి ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

కాగా, ఇందులో కపూర్ నిర్భయమైన డకాయిట్ పాత్రలో కనిపించనున్నారు. అతను డ్యూటీ ద్వారా బందిపోటు అని నమ్ముతూ పెరుగుతాడు. స్వేచ్ఛ అతని విశ్వాసం. అతను దాని కోసం ఏదైనా చేస్తాడు. ఈ చిత్రంలో సంజయ్ దత్, వాణీ కపూర్, రోనిత్ బోస్ రాయ్, సౌరభ్ శుక్లా తదితరులు నటిస్తున్నారు.

- Advertisement -

అయితే.. ఇంతకుముందు చెప్పినట్టు ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ స్టార్ సిగోర్నీ వీవర్ సైన్స్ ఫిక్షన్ చలనచిత్రంలో కనిపించిన కేట్ విన్స్ లెట్ రాబోయే సినిమాలో కూడా ఉండనున్నట్టు ఆన్‌లైన్‌లో కనిపించింది. వాటిలో ఆమె పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. డిస్నీ యొక్క రాబోయే చిత్రం ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ డిసెంబర్ 16, 20వ తేదీల్లో సెంచరీ స్టూడియోస్ ద్వారా రిలీస్​ కాబోతోంది. ఇది ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళంలో విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement