Wednesday, December 6, 2023

TS | 27న‌ టెట్‌ ఫలితాలు.. ప్ర‌క‌టించిన విద్యాశాఖ‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టెట్‌ (టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌) పరీక్ష ఫలితాలు రేపు విడుదలకానున్నాయి. విద్యాశాఖ ముందసుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 27న ఫలితాలను వెల్లడించనున్నారు. ఈనెల 15న టెట్‌ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ నిర్వహించిన సంగతి తెలిసిందే. పేపర్‌-1కు 2,69,557 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 2,26,744 (84.12 శాతం) మంది పరీక్షను రాశారు.

- Advertisement -
   

పేపర్‌-2 పరీక్షను 2,08,498 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 1,89,963 (91.11 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు. పేపర్‌-2తో పోల్చుకుంటే పేపర్‌-1 ప్రశ్నపత్రం సులువుగా వస్తే, పేపర్‌-2 కాస్తా టఫ్‌గా వచ్చింది. ఈ క్రమంలోనే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement