Sunday, December 10, 2023

TS | హెచ్‌ఎంలుగా పదోన్నతులు.. నేడో రోపో స్కూల్‌ అసిస్టెంట్ల బదిలీలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మల్టిజోన్‌-1లోని హెచ్‌ఎంల పదోన్నతుల ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఈక్రమంలోనే గ్రేడ్‌-2 హెడ్‌మాస్టర్లుగా ప్రమోషన్‌ పొందిన ఉపాధ్యాయులు పదోన్నతుల ఆర్డర్లు పొందారు. ఆర్డర్లు పొందిన వారు ఆయా పాఠశాలల్లో రిపోర్టింగ్‌ చేశారు. అయితే మొత్తం 2217 మంది ఉపాధ్యాయులు హెచ్‌ఎం పదోన్నతి కోసం వెబ్‌ ఆప్షన్లు పెట్టుకోగా వారిలో 1210 స్కూల్‌ అసిస్టెంట్లకు హెచ్‌ఎంగా పదోన్నతి పొందినట్లు తెలిసింది. గెజిటెడ్‌ హెచ్‌ఎంల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను విద్యాశాఖ అధికారులు విజయవంతంగా చేపట్టారు.

- Advertisement -
   

పదోన్నతులు పొందిన హెచ్‌ఎంలు ఆయా జిల్లాల్లో తమకు కేటాయించిన పాఠశాలల్లో సోమవారం నాడు రిపోర్ట్‌ చేశారు. ఎన్నో సంవత్సరాలుగా స్కూల్‌ అసిస్టెంట్‌లుగా విధులను నిర్వర్తించి ఇప్పుడు గ్రేడ్‌-2 హెచ్‌ఎంలుగా పదోన్నతులు పొంది విధుల్లో చేరడంపట్ల ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు. మల్టిజోన్‌-1 పరిధిలోని హెచ్‌ఎంల పదోన్నతుల ప్రక్రియ పూర్తవడంతో ఇక ఒకట్రెండు రోజుల్లో స్కూల్‌ అసిస్టెంట్ల బదిలీలను అధికారులు చేపట్టనున్నారు. ఇదిలా ఉంటే టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఒకడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా ఉంది. టీచర్ల బదిలీలు, పదోన్నతులపై 500 వరకు కోర్టు కేసులున్నట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మల్టి జోన్‌-2 పరిధిలో జిల్లా పరిషత్‌ టీచర్ల పదోన్నతులు ఆగాయి. అయితే జిల్లా పరిషత్‌ పదోన్నతులను ఆపి ప్రభుత్వ యాజమాన్య స్కూళ్ల స్కూల్‌ అసిస్టెంట్లకు పదోన్నతులను కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement