Friday, May 3, 2024

Telangana – పలువురు కలెక్టర్లు, ఎస్పీలు , సిపి ల బదిలీలు … ఆ స్థానాలలో తాత్కాలిక నియామకాలు జాబితా ఇదే

న్యూ ఢిల్లీ/ హైదరాబాద్ – తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇప్పటికే పలువురు కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఆయా స్థానాల్లో తాత్కాలిక నియామకాలు చేపట్టింది. హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ను బదిలీ చేసి.. ఆయన స్థానంలో హైదరాబాద్‌ అదనపు సీపీగా ఉన్న విక్రమ్‌సింగ్‌ మాన్‌ను నగర సీపీగా నియమించింది. మరోవైపు వరంగల్‌ సీపీ స్థానంలో నేరవిభాగం డీసీపీగా ఉన్న మురళీధర్‌ నియమితులయ్యారు.

నిజామాబాద్‌ సీపీగా ఎస్‌.జయరామ్‌, సూర్యాపేట ఎస్పీగా నాగేశ్వరరావు, సంగారెడ్డి ఎస్పీగా పి.అశోక్‌, జగిత్యాల ఎస్పీగా ఆర్‌. ప్రభాకర్‌రావు, కామారెడ్డి ఎస్పీగా కె.నరసింహారెడ్డి, మహబూబ్‌నగర్‌ ఎస్పీగా రాములు, నాగర్‌కర్నూల్‌ ఎస్పీగా సి.హెచ్‌. రమేశ్‌, జోగులాంబ గద్వాల ఎస్పీగా ఎన్‌.రవి, మహబూబాబాద్‌ ఎస్పీగా జె. చిన్నయ్య, నారాయణపేట ఎస్పీగా కె. సత్యనారాయణ, భూపాలపల్లి ఎస్పీగా ఎ.రాములును ఈసీ నియమించింది

Advertisement

తాజా వార్తలు

Advertisement