Monday, April 29, 2024

జాతీయ హ్యాండ్‌బాల్‌ పోటీలకు తెలంగాణ టీమ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: లక్నో వేదికగా సెప్టెంబర్‌ 7 నుంచి 12వ తేదీ వరకు జరుగనున్న జాతీయ 51వ సీనియర్‌ పురుషుల హ్యాండ్‌బాల్‌ టోర్నమెంట్‌కు తెలంగాణ జట్టును ఎంపిక చేశారు. ఎల్బీ స్టేడియంలో వారం రోజులుగా జరుగుతున్న శిక్షణ శిబిరం నుంచి తుది జట్టుకు 16మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. ఈ పోటీల్లో పాల్గొంటున్న తెలంగాణ జట్టుకు జాతీయ హ్యాండ్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు ఆర్శనపల్లి జగన్‌ మోహన్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. టైటిల్‌ లక్ష్యంగా పోరు సాగించి, విజయం సాధించాలని ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జాతీయ హ్యాండ్‌బాల్‌ కోచ్‌ రవి, తెలంగాణ హ్యాండ్‌బాల్‌ సంఘం ప్రతినిధులు ఫ్రాంక్లిన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement