Friday, May 17, 2024

కామన్వెల్త్‌ కరాటే చాంపియన్‌షిప్‌కు వివేక్‌.. ఇంగ్లండ్‌లో పోటీలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌ వేదికగా ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు జరుగనున్న కామన్వెల్త్‌ కరాటే చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు భారత్‌ తరఫున తెలంగాణకు చెందిన ప్రముఖ కరాటే క్రీడాకారులు చెరుపల్లి వివేక్‌ తేజకు అవకాశం లభించింది. వరల్డ్‌ కరాటే ఫెడరేషన్‌, కామన్వెల్త్‌ కరాటే ఫెడరేషన్‌ సంయుక్తంగా కామన్వెల్త్‌ కరాటే చాంపియన్‌షిప్‌ టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నారు.

ఈ టోర్నీలో పురుషుల సీనియర్‌ విభాగం 84 కిలోల వ్యక్తిగత కేటగిరిలో వివేక్‌ తేజ బరిలోకి దిగుతున్నాడు. హైదరాబాద్‌లోని కొత్తపేట్‌కు చెందిన వివేక్‌ పలు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని ఇప్పటి వరకు 27 స్వర్ణ పతకాలు సాధించారు. 2019లో మలేసియాలో జరిగిన వరల్డ్‌ కరాటే చాంపియన్‌షిప్‌లో వివేక్‌ తేజ రజతం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement