Wednesday, May 15, 2024

Breaking: తెలంగాణ అసెంబ్లీ వాయిదా..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేశారు. ఇవాళ ఉదయం 11గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యారు. ప్రారంభమైన సమావేశాల్లో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఈనెల 14వతేదీకి అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి.

అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ సభ్యులు పాల్గొనలేదు. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ ఉన్నందువల్ల తాము అసెంబ్లీకి రాకుండా బహిష్కరించినట్లు పేర్కొన్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్య సమస్యల కారణంగా.. కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ లు కూడా ఈ శాసనసభ సమావేశాల్లో పాల్గొనలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement