Wednesday, May 15, 2024

Human Error – కంటకాప‌ల్లి రైల్వే ప్ర‌మాదం మాన‌వ త‌ప్పిద‌మే …కేంద్ర‌మంత్రి అశ్వ‌నీ వైష్ట‌వ్

సింహ‌చ‌లం ..కంటకాప‌ల్లి రైల్వే ప్ర‌మాదం మాన‌వ త‌ప్పిద‌మేన‌ని రైల్వే శాఖ మంత్రి అశ్వ‌నీ వైష్ట‌వ్ వెల్ల‌డించారు.. సింహాచలం రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం ప్రారంభించారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌లో రూ.20 కోట్లతో రైల్వే శాఖ సింహాచలం స్టేషన్‌ అభివృద్ధి పనులను చేపట్టింది. ఈ సందర్భంగా రైల్వే మంత్రి మాట్లాడుతూ విజయనగరం జిల్లా కంటకాపల్లి రైల్వే ప్రమాదం మానవ తప్పిదం వల్లే జరిగిందన్నారు. ఈ ఘటనపై ఇంకా విచారణ కొనసాగుతోందని చెప్పారు.

‘త్వరలో మరిన్ని వందే భారత్ రైళ్ళు పట్టాలెక్కనున్నాయి. వారానికి ఒక వందే భారత్ రైలు నిర్మాణం జరుగుతోంది. రైల్వేలను రాజకీయాలతో ముడిపెట్టి చూడొద్దు. ఏపీలో రైల్వేల అభివృద్ధి కోసం 8వేల 406కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. భూ కేటాయింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. దేశంలో 5జీ మొబైల్‌ సర్వీసుల విస్తరణ చాలా వేగంగా జరుగుతోంది. దీపావళి నాటికి బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి. నాలుగువేల నూతన సెల్ ఫోన్ టవర్లు ఏర్పాటవుతున్నాయి. ఇందులో ఎక్కువ ఉత్తరాంధ్రలోనే నిర్మాణం జరుగుతున్నాయి’అని అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement