Thursday, May 16, 2024

Telangana – 10న బ‌డ్జెట్ , 13 వ‌ర‌కు అసెంబ్లీ స‌మావేశాలు…

హైద‌రాబాద్ – తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2024 ఫిబ్రవరి 13 వరకు నిర్ణయించాలని బీఏసీ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. నేడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించగా..రేపు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఉంటుంది. ఫిబ్రవరి 10వ తేదీన రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెడుతారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇవే తొలిసారి బడ్జెట్‌ సమావేశాలు కాగా పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్ష స్థానంలో ఉండి తొలిసారి బడ్జెట్‌ సమావేశాల్లో పాల్గొంటోంది. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి దూరంగా ఉన్న కేసీఆర్ ఫిబ్రవరి 10వ తేదీన అసెంబ్లీకి రానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement