Sunday, February 5, 2023

బీజేపీలోకి తీన్మార్.. ఇక చెడుగుడే..

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ త‌న బ‌లాన్ని పెంచుకుంటోంది. భారతీయ జ‌నతా పార్టీలోకి వ‌ల‌స‌లు పెరిగిపోతున్నాయి.ఇప్ప‌టికే ప‌లువురు కాషాయ తీర్థం పుచ్చుకోగా.. తాజాగా క్యూ న్యూస్ అధినేత‌ తీన్మార్ మ‌ల్ల‌న్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర‌ ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ స‌మ‌క్షంలో బీజేపీ పార్టీ లో చేరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, ఎంపీలు ధర్మపురి అరవింద్, ఎంపీ సోయం బాబూ రావు, తదితరులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా బండి సంజ‌య్ మాట్లాడుతూ… తీన్మార్ మల్ల‌న్న బీజేపీ పార్టీలో చేర‌డం చాలా సంతోషంగా ఉంద‌న్నారు. ప‌ద‌వులు, సీట్ల కోసం బీజేపీలో తీన్మార్ మ‌ల్ల‌న్న చేర‌లేద‌ని.. కేవ‌లం టీఆర్ ఎస్ పార్టీని తెలంగాణలో అంత‌మొందించేందుకు చేరార‌ని తెలిపారు. ప్ర‌జ‌ల కోసం తీన్మార్ మ‌ల్లన్న పోరాటం చేస్తున్న వ్య‌క్తి అని బండి సంజ‌య్ తెలిపారు. కాగా… తెలంగాణ ఉద్యమకారుడు, టీఎస్పీఎస్సీ (TSPSC) మాజీ సభ్యుడు చింతలగట్టు విఠల్ నిన్న‌ బీజేపీలో చేరిన విష‌యం విదిత‌మే..

- Advertisement -
   

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement