Saturday, October 12, 2024

భారత్‌లో ఊపందుకోనున్న డిజిటల్‌ అసెట్స్‌.. 2032 నాటికి 1.1 ట్రిలియన్ డాలర్లకు..

న్యూఢిల్లి: అగ్రగామి క్రిఎ్టో, డిజిటల్‌ అసెట్‌ ఎక్స్చేంజ్‌లలోఒకటైన క్రాస్‌ టవర్‌, యూఎస్‌ ఇండియా స్ట్రాటజిక్‌ పార్టనర్‌షిప్‌ ఫోరం(యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌)తో కలిసి ఇండియాస్‌ 1.1 ట్రిలియన్‌ డిజిటల్‌ అసెట్స్‌ ఆపర్చునిటీస్‌ పై తన అధ్యయన నివేదికను సమర్పించింది. భారత జీడీపీకి సంబంధించి డిజిటల్‌ అసెట్‌ ఆర్థిక వ్యవస్థ 2021లో 5.1 బిలియన్‌ డాలర్లు ఉండగా 11 ఏళ్లలో 43.1 శాతం సీఏజీఆర్‌ చొప్పున వృద్ధితో 2032 నాటికి 261.8 బిలియన్‌ డాలర్లకు చేరుకోనుందని క్రాస్‌ టవర్‌, యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌ నివేదిక అంచనా వేసింది. ఫలితంగా భారత జీడీపీకి డిజిటల్‌ అసెట్స్‌ 1.1 ట్రిలియన్‌ డాలర్ల మేర తోడ్పాటు అందించనుందని రిపోర్ట్‌ విశ్లేషించింది. డిజిటల్‌ అసెట్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 2013లో సుమారుగా 1.5 బిలియన్‌ డాలర్లు ఉంది. ప్రస్తుతం ఈ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ సుమారుగా 3.0 ట్రిలియన్‌ డాలర్లుగా ఉందని నివేదిక తెలియజేస్తోంది.

భారతదేశఆర్థిక వ్యవస్థ ఆవరణను డిజిటైజింగ్‌ చేసేందుకు బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ ఏవిధంగా స్వయం సమృద్ధం కాగలదో కూడా ఈ నివేదిక తెలియజేసింది. కాగా అధ్యయన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి. 1). డిజిటల్‌ అసెట్స్‌ అనుసరణ రేటు ఇంటర్నెట్‌తో పోల్చితే రెండు రెట్లు వేగంగా వృద్ధి చెందుతుంది. 100 మిలియన్‌ యూజర్ల నుంచి ఒక మిలియన్‌ యూజర్లకు చేరుకునేందుకు ఇంటర్నెట్‌కు 7.5 ఏళ్ల సమయం పట్టింది. అదే వృద్ధిని క్రిఎ్టో కరెన్సీ ఎక్స్చేంజీలు నాలుగేళ్లలో సాధించాయని పేర్కొంది. 2). వెబ్‌ 3.0 అనేది రాబోయే 11 ఏళ్లలో భారతదేశానికి 1.1 ట్రిలయిన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను అందించనుంది. అయితే అందుకు సరైన విధానాలు, నియంత్రణ వ్యవస్థలు అవసరమవుతాయి. అంతర్జాతీయ ఆర్థిక సేవల మార్కెట్‌ 2021లో 22 ట్రిలియన్‌ డాలర్లు ఉండగా.. 2025 నాటికి 28 ట్రిలియన్‌ డాలర్లకు వృద్ధి చెందనుందని అంచనా వేసింది. 3). డిజిటల్‌ ఆర్ట్‌ నుంచి టికెట్‌ విక్రయాలు, మ్యూజిక్‌, కలెక్టబుల్స్‌, విలాస్‌ వస్తువులు, గేమింగ్‌, నాన్‌ – ఫంగిబుల్‌ టోకెన్స్‌ లాంటివి ప్రజలు రోజువారీగా వ్యవహరించే తీరుతెన్నులను అపారంగా మార్చనున్నాయని రిపోర్ట్‌ పేర్కొంది.

ఈ సందర్భంగా యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌ ప్రెసిడెంట్‌, సీఈవో డాక్టర్‌ ముఖేష్‌ అఘి మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చెబుతున్నట్టుగా 2024- 25 నాటికి భారతదేశం 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా వృద్ధి చెందనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వేగవంతమైన అనుసరణ వల్ల వివిధ దేశాల్లో రాబోయే 11 ఏళ్లలో డిజిటల్‌ అసెట్స్‌ అపార వృద్ధి అవకాశాలనుకలిఉన్నాయని అన్నారు. భారత్‌ 5 ట్రిలియన్‌ డారల్‌ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోవడానికి అవి తోడ్పడతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement