Thursday, April 25, 2024

ఎంపీ సంతోష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఎర్ర‌బెల్లి ..

రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్ కుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా పుష్ప గుచ్ఛం అందించి, శాలువాతో సంతోష్ ని .. మంత్రి సత్కరించారు. సంతోష్ .. జీవితాంతం ఆయురారోగ్యాలతో ఉండాలని, సుదీర్ఘ ప్రజా జీవితం వారికి దక్కాలని కోరుకున్నారు. ఎంపీ సంతోష్ కి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, ఐటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చిరుమల్ల రాకేష్, టిఆర్ ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement