Friday, September 22, 2023

TS: కంటతడి పెట్టిన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్

జన్నారం, సెప్టెంబర్ 15 (ప్రభ న్యూస్): పల్లెలోని ప్రజలను పరామర్శించడానికి వెళ్లిన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ప్రజల ముందు కంటతడి పెట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని చింతగూడ, జన్నారం, పోనకల్, కిష్టాపూర్, కవ్వాల, రోటి గూడెం, గూళ్ళగూడెం గ్రామాలలో శుక్రవారం ఎమ్మెల్యే రేఖా నాయక్ పర్యటించి, చనిపోయిన కుటుంబీకులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… తాను ప్రజల్లో ఉండి పోటీ చేస్తానన్నారు. తాను గత తొమ్మిది సంవత్సరాలుగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఖానాపూర్ నియోజకవర్గంలోని ప్రతి పల్లెను అభివృద్ధి చేశానని ఆమె చెప్పారు.

- Advertisement -
   

ప్రస్తుతం తనకు టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేశారని, తాను ప్రజాక్షేత్రంలోనే ఉండి, ప్రజల బాగోగులు చూసుకుంటూ ప్రజల అభివృద్ధే ధ్యేయంగా మళ్లీ పోటీ చేస్తానన్నారు. ప్రస్తుతం మంజూరైన నిధులను నిలిపివేసి, అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని చింతగూడ గ్రామంలోని ప్రజల వద్ద ఆమె తన గోడును వెళ్లబోసుకుంటూ కంటతడి పెట్టుకుని విలపించారు. పదిమంది కలిసిన చోట తన గోడు వెల్లబోసుకొని కంటతడి పెట్టుకుంటూ, తన ఉసురు ఊరికే పోదని తనకు అన్యాయం చేసిన వారికి తప్పకుండా తగులుతుందని ఆమె శాపనార్ధాలు పెట్టారు. గ్రామంలోని లక్ష్మీదేవి దేవాలయంలో పూజలు చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముత్యం సతీష్, డైరెక్టర్ ఏ.కాంతమని, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement