Thursday, May 2, 2024

టీచర్ల ట్రాన్స్ ఫర్, ప్రమోషన్ షెడ్యూల్ ఇవ్వాలే

హైదరాబాద్,ప్ర‌భ‌న్యూస్:కొత్త జిల్లాల ప్రకారం ఉపాధ్యాయులను శాశ్వత ప్రాతిపదికన కేటాయింపుకై మార్గదర్శకాలు విడుదల చేసి వెంటనే బదిలీలు, పదోన్నతులు, అంతర్‌ జిల్లా బదిలీల షెడ్యూల్‌ను విడుదల చేయాలని పీఆర్టీయూ టీఎస్‌ విజ్ఞప్తి చేసింది. ఈమేరకు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌ రావులు సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ను తన కార్యాలయంలో సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు. రెండు, మూడు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేసి ఉద్యోగ, ఉ పాధ్యాయులకు ఐచ్ఛికాలు స్వీకరించి నవంబర్‌ నెలాఖరులోగా ప్రక్రియను పూర్తి చేస్తామని సీఎస్‌ హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement