Saturday, April 27, 2024

Breaking: కారులో ఆకస్మికంగా మంట‌లు.. క‌రీంన‌గ‌ర్‌లో ఘ‌ట‌న‌

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూరు శివారులో ఓ కారులో నుండి ఆకస్మికంగా మంటలు చెలరేగి కారు దగ్ధమైన సంఘటన చోటుచేసుకుంది. వీణవంక మండలం ఎల్బాక గ్రామానికి చెందిన పొన్నాల అనిల్ తన హ్యుందాయ్ ఎక్సేంట్ కారులో మరో ఇద్దరితో కలిసి పెద్దపల్లికి వెళ్తున్న తరుణంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. మానకొండూరు మండలం ఊటూరు శివారులో కి రాగానే కారులో నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

అనిల్ తో పాటు మరో ఇద్దరు కారులో నుండి వెంటనే దిగగా ప్రాణాపాయం తప్పింది. క్షణాల్లో మంటలు దావానంలా వ్యాపించాయి. కళ్ళముందే కారు కాలిపోతున్న ఏమి చేయలేని నిస్సాహాయ స్థితిలో అనిల్ ఉండిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే స్పష్టత తెలియరాలేదు. ఒకవేళ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కూడా కారణమని కూడా పలువురు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement