Wednesday, May 8, 2024

సీసీ కెమెరాలతో నేరాల అదుపు, చోరీలు, దోపిడీల‌పై ప్ర‌త్యేక నిఘా : ఏసీపీ సారంగ‌పాణి

పెద్దపల్లి, (ప్రభన్యూస్‌): నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి పేర్కొన్నారు. సోమవారం పెద్దపల్లి పట్టణంలోని ఎస్‌ఆర్‌ఆర్‌ సీజన్‌ సెంటర్‌ యజమాని, 29 వ వార్డు కౌన్సిలర్‌ ఇల్లందుల కృష్ణమూర్తి సీసీ కెమరాలను పోలీస్‌ శాఖకు అందించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, దొంగతనాలు, ఇతర ఘటనలు జరిగిన సమయాల్లో సీసీ కెమెరాల ద్వారా నిందితులను పట్టుకునెదుకు ఈజీగా ఉంటుంద‌న్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు కోసం వ్యాపారులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రజల భద్రత, నేరాల నియంత్రణ కోసం పోలీస్‌ శాఖ పని చెస్తుందని, ప్రతి ఒక్కరూ పోలీస్‌ శాఖకు సహకరించాలని కోరారు. ఈకార్యక్రమంలో ఎస్ఐ లు రాజేష్, రాజవర్దన్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement