Saturday, April 27, 2024

అసెంబ్లీ ఆవ‌ర‌ణలో కంటి వెలుగు ప్రారంభించి.. టెస్ట్ చేయించుకున్న స్పీకర్ పోచారం

ఎం ఐ ఎం శాసన సభ్యులు అక్బరుద్దీన్, పాషా ఖాద్రి,ముంతాజ్ ఖాన్ లను అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన కంటివెలుగు స్టాల్ ల వద్దకు స్వయంగా తీసుకువచ్చి ఎమ్మెల్యేలకు పరీక్షలు చేయించారు ఆర్ధిక,వైద్యారోగ్యా శాఖ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా కంటివెలుగు ప్రాముఖ్యతను వివరించారు మంత్రి. కంటి వెలుగు కార్యక్రమం అద్భుతంగా ఉందన్నారు ఎం ఐ ఎం శాసన సభ్యులు.శాసన సభ ఆవరణలో కంటి వెలుగు కార్యక్రమంను ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్ ను, మంత్రి హరీష్ రావు, ప్రభుత్వం అభినందించారు ఎం ఐ ఎం ఎమ్మెల్యేలు.కాగా అసెంబ్లీ ఆవ‌ర‌లో కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి..ఈ కార్య‌క్ర‌మంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు, శాసనసభ వ్యవహారాలమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మారివేందర్, సుదర్శన్ రెడ్డి, వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. కంటివెలుగు టెస్టులు చేయించుకున్నారు స్పీకర్, చైర్మన్, మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు. అసెంబ్లీలో ఆవరణంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు టెస్టింగ్ సెంటర్ లో ప్రజాప్రతినిధులు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
కంటి వెలుగు దేశంలోనే గొప్ప పథకమ‌ని అన్నారు. కంటి వెలుగు వల్ల పేదలకు ఎంతో ఉపయోగకరమ‌న్నారు.ఇతర రాష్ట్రాల వాళ్ళు దీన్ని ఆదర్శంగా తీసుకుంటున్నార‌న్నారు. ప్రజాప్రతినిధులందరూ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement