Sunday, December 10, 2023

సోషల్ మీడియా ఆఫ్ ది ఇయర్ గా మోత్కూర్ వాసి కొణతం దిలీప్

మోత్కూర్, సెప్టెంబర్ 23 (ప్రభ న్యూస్) యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రానికి చెందిన తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం రాష్ట్ర డైరెక్టర్ కొణతం దిలీప్ ఆ విభాగంలో 5 కేంద్ర ప్రభుత్వ అవార్డులు అందుకున్నారు.సోషల్ మీడియా ఆఫ్ ది ఇయర్ గా ఎంపికైన దిలీప్ కు కేంద్ర మాజీ మంత్రి ముక్తర్ అబ్బాస్ నక్వీ ఈ అవార్డు ను ఢిల్లీలో అందజేశారు.

- Advertisement -
   

.ఈ అవార్డ్ తో పాటు మరో 4 పీఆర్సీ ఐ ఎక్సలెన్సీ అవార్డులను ఆయన స్వీకరించారు.న్యూ ఢిల్లీ లో 2 రోజుల పాటు జరుగుతున్న 17 వ గ్లోబల్ కమ్యూనికేషన్ కాంక్లేవ్ లో అవార్డులను ప్రధానం చేయగా ఆయన స్వయంగా స్వీకరించారు.జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సామాజిక మాధ్యమాల్లో విశేష కృషి చేసిననందుకు కేంద్ర ప్రభుత్వం అవార్డు ను అందించినట్లు తెలిపారు.2014 లో తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం ఏర్పాటు కాగా,నా టి నుండి ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం ,సేవలను డిజిటల్ మధ్యమాలలో పౌరులకు చేరవేయడం డిజిటల్ మీడియా ప్రధాన బాధ్యత అని తెలిపారు.సీపీఐ జిల్లా నాయకులు కీ.శే.కొనతం బక్కారెడ్డి కుమారుడైన దిలీప్ డిజిటల్ మీడియా రంగంలో జాతీయ స్థాయి అవార్డు అందుకోవడం పట్ల మోత్కూర్ ప్రాంత ప్రజలు,ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement