కొండగట్టులో గత మూడు రోజులు కొనసాగుతున్న హనుమాన్ చిన్న జయంతి వేడుకలు నేటితో ముగియనున్నారు. ఈనేపథ్యంలో స్వామివారిని దర్శించుకునేందుకు దీక్షాపరులు తెల్లవారు జామును ఆలయానికి తరలివస్తున్నారు. స్వామివారి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
- Advertisement -
అంతరాలయంలో స్వామిని పండ్లతో అలంకరించారు. దీక్షామండపంలో మాలవిరమణ చేసిన భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. దర్శనానికి రెండు గంటలకు పైగా సమయం పట్టింది. నేటితో హనుమాన్ చిన్న జయంతి వేడుకలు ముగుస్తాయి. అంజన్నను ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.