Sunday, April 28, 2024

Sirpur – కోన‌ప్ప మంచోడు… నిజాయితీ ప‌రుడు.. భారీ మెజార్టీతో గెలిపించాలిః కెసిఆర్

సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోన‌ప్ప‌కు తాను ఎమ్మెల్యే అనే గ‌ర్వం లేదు.. గ్రామాల్లో తిరుగుతూ ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మైపోతార‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌శంసించారు. అలాంటి ఎమ్మెల్యేను పొగోట్టుకోవ‌ద్దు అని, భారీ మెజార్టీతో గెలిపించుకోవాల‌ని నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు కేసీఆర్ పిలుపునిచ్చారు. కోన‌ప్ప‌కు ఎమ్మెల్యే అనే గ‌ర్వం లేదు.. ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మైపోతారు అని కాగజ్ నగర్ సభలో కోనేరు కోనప్ప ని సీఎం కేసీఆర్ ప్రశంసించారు . సిర్పూర్ కాగ‌జ్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ మాట్లాడుతూ, సామాజిక సేవ చేసే వ్యక్తి కోనేరు కోనప్ప.. అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి కోనప్ప. మంచి మనసున్న వ్యక్తి. మేం గెలిచే సీట్లల్లో కాగజ్ నగర్ నెంబర్ వన్ గా ఉంటుంది. గెలిచే ఎమ్మెల్యేల్లో కూడా కోనప్ప నే నెంబర్ వన్ ప్లేస్ లోనే ఉన్నారు. ఇక్కడి జనాన్ని చూస్తుంటే కోనప్ప గెలుపు ఖాయమైపోయింది అని అన్నారు.


తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో అతి కొద్ది మంది గొప్ప ఎమ్మెల్యేల్లో కోన‌ప్ప ఒక‌రు. అద్భుత‌మైన ప్ర‌జాసేవాలో ఉంటారు. అంత బ్ర‌హ్మాండంగా ప‌ని చేస్తారు. నా ద‌గ్గ‌రికి ఎప్పుడొచ్చినా బ్రిడ్జిలు, కాల్వ‌ల పంచాయితీ, ప‌ట్ట‌ణ అభివృద్ధి గురించి అడిగారు. వ్య‌క్తిగ‌త ప‌నులు అడ‌గ‌లేదు. ఎమ్మెల్యే అనే గ‌ర్వం లేదు. ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మైపోతారు. అంద‌రికీ అందుబాటులో ఉంటారు. హైద‌రాబాద్‌లో త‌క్కువ‌.. కాగ‌జ్‌న‌గ‌ర్‌లో ఎక్కువ ఉంటారు. గ్రామాల్లో తిరుగుతూ ఉంటారు. ఎగ్జామ్స్ టైమ్‌లో పిల్ల‌ల‌కు భోజ‌నాలు పెట్టిస్తారు. ఎవ‌రికైనా ఆప‌ద వ‌స్తే అక్క‌డ వాలిపోయి ఆదుకుంటారు. గొప్ప మ‌న‌సున్న వ్య‌క్తి అని కేసీఆర్ కొనియాడారు.

అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో కాగ‌జ్‌న‌గ‌ర్ నంబ‌ర్ వ‌న్.. మ‌న రాష్ట్ర ఎమ్మెల్యేల సంఖ్య ఇక్క‌డి నుంచే ప్రారంభం అవుతుంది. గెలిచే ఎమ్మెల్యేల్లో కోన‌ప్ప కూడా నంబ‌ర్ వ‌న్‌లో ఉన్నారు. అందులో సందేహం లేదు. మిమ్మ‌ల్ని చూస్తుంటే ఆయ‌న గెలుపు ఖాయ‌మైపోయింద‌ని అర్థ‌మవుతుంది. ఇంత మంచొళ్ల‌ను పొగోట్టుకోవ‌ద్దు. కోన‌ప్ప లాంటి మంచి ఎమ్మెల్యే పేప‌ర్ మిల్లు తెరిపించేందుకు ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. ఎంతో బాధ‌ప‌డ్డారు. ప‌ది కంపెనీల‌ను ప‌ట్టుకురావాల‌ని తిరిగి చివ‌ర‌కు ఒక కంపెనీ ప‌ట్టుకొచ్చారు. మీ ప్ర‌భుత్వం ద‌య వ‌ల్ల‌, మ‌ద్ద‌తుతో మునుప‌టి కంటే ఎక్కువ ప్రొడ‌క్ష‌న్ చేస్తున్నాం అని కంపెనీ నిర్వాహ‌కులు తెలిపారు. కాగ‌జ్‌న‌గ‌ర్ ఒక‌ప్పుడు మినీ ఇండియాలాగా ఉండే.. అన్ని రాష్ట్రాల వారు ఇక్క‌డ‌కు ప‌నికి వ‌చ్చేవారు. కానీ వైభవం కోల్పోయింది. మ‌ళ్లీ వైభ‌వం తీసుకురావాలి.. మిగిలిన ఖార్ఖానాలు తెరిపించాల‌ని కోరారు. త‌ప్ప‌కుండా కోన‌ప్ప ఆధ్వ‌ర్యంలోనే ప‌రిశ్ర‌మ‌లు వ‌చ్చే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటాం. వెంబ‌డి ప‌డితే విడిచే ర‌కం కాదు కోన‌ప్ప‌. నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి కోసం పోరాడుతారు అని కేసీఆర్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement