Thursday, May 2, 2024

MBNR: నామినేషన్ వేసిన గద్వాల కాంగ్రెస్ అభ్యర్థి సరిత

జోగులాంబ గద్వాల జిల్లా : గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సరిత వేదపండితుల మంత్రోచ్ఛరణల, క్రైస్తవ, ముస్లిం మత పెద్దలు, అత్తమామల ఆశీర్వాదం తీసుకున్నారు. పీజేపీ క్యాంప్ నందు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంత‌రం కాంగ్రెస్ పార్టీ గద్వాల ఎమ్మెల్యే అభ్యర్థిగా సరిత జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ సెంటర్ లో రిటర్న్ంగ్ అధికారికి నామినేషన్ దాఖలు అందజేశారు. ఆమె వెంట న్యాయవాది షఫీవుల్లా, కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మీదేవి, బండ్ల చంద్రశేఖర్ రెడ్డి, మధుసూదన్ బాబు, ఆనంద్ గౌడ్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement