Sunday, May 5, 2024

TS : సింగ‌రేణి న‌యా రికార్డ్…70.02 మిలియ‌న్ ట‌న్నుల బొగ్గు ఉత్ప‌త్తి..

సింగరేణి రికార్డుల మీద రికార్డులను సృష్టిస్తున్నది. పాత రికార్డులను తిరగరాస్తూ.. 2023 -24 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి, రవాణాలో నయా రికార్డును సొంతం చేసుకున్నది. ఈ ఒక్క సంవత్సరంలోనే 70.02 మిలియన్‌ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసిన సంస్థ..69.80 మిలియన్‌ టన్నుల బొగ్గును రవాణా చేసింది.

- Advertisement -

2022-23లో 67.14 మిలియన్‌ టన్నులు, 2021-22లో 65.02 మిలియన్‌ టన్ను లు, 2020-21లో 50.58 మిలియన్‌ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. అలాగే రవాణలోనూ 2019-20లో 62.45 మిలియన్‌ టన్నులు కాగా, 2020-21లో 48.51 మిలియన్‌ టన్నులు, 2021-22లో 65.53 మిలియన్‌ టన్నులు, 2022-23లో 66.69 మిలియన్‌ టన్నుల బొగ్గును సరఫరా చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement