Thursday, May 2, 2024

Siddipet: పారిశుధ్య పనులు చేపట్టిన సిద్దిపేట కౌన్సిలర్స్

సిద్దిపేట ప్రతినిధి : చెత్త దైవత్వంతో సమానం… మనం వేసే చెత్త మనం తయారు చేసుకున్న గొప్ప సంపద అని చెత్తతో మనం ఉపయోగించే ఎన్నో కార్యమాలకు చెత్త నుండి చేసుకోవచ్చని సిద్దిపేటనే నిదర్శనం అని చూపింది… అందుకు మంత్రి హరీష్ రావు ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.. అందులో బాగంగానే స్వచ్ఛ బడి.. అందులో బాగంగానే బయో గ్యాస్.. అందులో బాగమే ఎరువుల తయారీ .. మూడు రకాల చెత్తను వేరు చేసే విధానం ఇలా ఎన్నో చెత్త నుండి చేసుకోవచ్చనని సిద్దిపేట నుండి చేసి చూపించారు మంత్రి హరీష్ రావు. గత 15 ఏళ్లుగా సిద్దిపేటలో చెత్త సేకరణ చేస్తున్న విషయం తేలిసిందే.. ఎన్నో కార్యక్రమాలకు నిలువుగా మారిన మన సిద్దిపేట మరో కొత్త కార్యక్రమానికి మంత్రి హరిష్ రావు శ్రీకారం చుట్టారు.. అదే ‘ నడుస్తూ చెత్తను వేరుదాం..వేరు చేద్దాం ‘.. గత నెల రోజుల నుండి సిద్దిపేట పట్టణంలో వార్డు వార్డుకు.. ఇంటింటికి మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు, వైస్ చైర్మన్ కనకరాజు, కమిషనర్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిలర్స్, సిబ్బంది తో ప్రతి ఇంటికి వెళ్లి.. ప్రతి ఒక్కరి చెత్తను వేరు చేసే విధానం.. చెత్త నుండి సిద్దిపేటలో ఏం చేయబోతున్నాం.. చేస్తున్నామో వివరిస్తూ చైతన్యం చేస్తున్నారు..

  • చెత్త కుండి లేని…ప్లాస్టిక్ రహిత పట్టణంగా చేయడమే లక్ష్యం..
    పందులను తరిమి సిద్దిపేట స్వచ్ఛతకు తొలి అడుగు పడింది.. చెత్త సేకరణతో రెండవ అడుగు పడితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో మూడో అడుగు పడింది.. ఆయన మంత్రి హరీష్ రావు పటిమ ఆగలే సిద్దిపేట శుద్ధి పేట అని తుది అడుగుకు చేరువలో ఉన్నాం అదే సిద్దిపేటలో చెత్త కుండి లేని పట్టణంగా దేశంలో ప్రథమంగా నిలవాలని మంత్రి హరీష్ రావు సంకల్పించుకున్నారు. ఇప్పటికే బ్లాక్ స్పాట్ పై నిఘా పెట్టి తీసేసారు.. వార్డ్ వార్డుకు ఇంటిఇంటికి తిరుగుతూ చెత్త లేకుండా చేస్తున్నారు. ఒక నాడు సిద్దిపేటలో ఎక్కడ చూసినా చెత్త కుండీలు.. చెత్త కుప్పలు.. కానీ నేడు అవే పార్క్ లు.. మొక్కలతో పచ్చదనంతో వెల్లివిరుస్తున్నాయ్.. చెత్త కుండి కుప్ప లేని పట్టణంగా కొద్ది చెరువులో తుది ఘట్టంలో సిద్దిపేట నిలుస్తున్నది.. మంత్రి హరీష్ రావు ఇందుకు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ అధికారులను, ప్రజాప్రతినిధులను చైతన్యం చేస్తున్నారు.. అదే పంథాలో ప్లాస్టిక్ రహిత సిద్దిపేటగా తీర్చిదిద్దే కార్యక్రమానికి మంత్రి ఎంతో తపన తో స్టీల్ బ్యాంక్ అనే గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు.. సిద్దిపేట పట్టణంలో అన్ని వార్డుల్లో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం తెచ్చారు.. మరింత విస్తృతం చేసే విధంగా ప్లాస్టిక్ రహిత పట్టణంగా చేయడంలో అందరిని భాగస్వామ్యం చేస్తున్నారు..
  • కల్సి కట్టుగా నడుస్తూ… చెత్తను వేరు చేస్తూ..
  • పొద్దుగాలనే ప్రజల ముంగిట కౌన్సిలర్స్..
  • చెత్త పై ప్రజల్లో అవగాహన.. చైతన్యం…
  • ప్రజలను భాగస్వామ్యం చేస్తున్న కౌన్సిలర్స్ ను, మున్సిపల్ సిబ్బందిని అభినందించిన మంత్రి హరీష్ రావు ..

“నడుస్తూ చెత్తను వేరుదాం.. వేరు చేద్దాం అనే కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ప్రతి రోజు పొద్దున్నే ప్రజల ముంగిట కౌన్సిలర్స్ చెత్త వేరు చేసే కార్యక్రమం చేపడుతున్నారు.. ఇప్పటికే 20వార్డులు పూర్తి కాగా, మరో 23 వార్డుల్లో ఈ కార్యక్రమం పై మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు.. ఇది నిరంతర కార్యక్రమంగా కొనసాగాలని మంత్రి హరీష్ రావు ఇటీవలే ఆదేశించారు.


ఈ కార్యక్రమం పై ఎప్పటిప్పుడు వాట్సప్ గ్రూప్ లో మంత్రి సూచనలు ఇస్తూ మరింత ఉత్సాహాన్ని స్పూర్తిని నింపుతున్నారు.. చెత్తను వేరడం.. తడి, పొడి, హాని కర చెత్తను వేరు చేయడంపై అవగాహన కల్పించడం ..వర్షా కాలం కావడంతో నీళ్లు నిల్వకుండా తీసుకునే చర్యలు.. పాత సామాన్ లాంటివి లేకుండా చేయడం ఇలా ఎన్నో ప్రజల్లో చైతన్యం తేవడంలో కృషి చేస్తూ ఈ కార్యక్రమాన్ని అద్బుతంగా నిర్వహిస్తున్న సిద్దిపేట కౌన్సిలర్స్ ను , సిబ్బందిని ఇందులో భాగస్వామ్యం అవుతున్న ప్రతి ఒక్కరినీ మంత్రి హరీష్ రావు అభినందించారు…ఇదే స్ఫూర్తితో నిరంతరం ఈ కార్యక్రమం కొనసాగించాలన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement