Monday, May 6, 2024

Shankarpally : ఈ బుడ్డోడికి ఎంత కష్టం

శంకరపల్లి (ప్రభ న్యూస్) : ఎంత కష్టం వచ్చిందో ఈ బుడ్డోడికి.. ఆటపాటలతో ఆడుకోవాల్సిన వయసులో వాహనంపై కూర్చొని తనకు అప్పగించిన కఠినమైన పనిని చేస్తున్నాడు. ఈ చిన్నారి తీరు చూసేవారికి ఎంతో బాధను మిగిల్చింది..పట్టణ పరిధిలోని చేవెళ్ల రోడ్డులో విపరీతమైన గుంతలు.. ఆ గుంతలలోనే ఇటువంటి ప్రయాణం, శంకరపల్లి పట్టణంలోని చేవెళ్ల రోడ్డులో ఈ దృశ్యం కంటబడింది, ఎవరు అభివృద్ధి చెందుతున్నారు, అభివృద్ధి ఫలాలు ఎక్కడికి పోతున్నాయో, ఆలోచించవలసిన అవసరాన్ని ఈ దృశ్యం తూర్పారబట్టింది, ఎండాకాలం సైలెన్సర్ పై ఆ పిల్లోడు కాలు పెట్టి కూర్చోవడం, మాటిమాటికి కాలు పైకి లేపి మ‌ళ్లీ పెట్ట‌డం చూస్తుంటే చూసేవారికి అయ్యో అనే పరిస్థితి ఏర్పడింది. బాల కార్మిక వ్యవస్థను అరికట్టవలసిన అధికారులు.. ఏం చేస్తున్నారో అనిపిస్తుంది ఇటువంటి దృశ్యాలు చూసిన‌ప్పుడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement