Sunday, April 28, 2024

Pune : గోదాంలో భారీ అగ్నిప్ర‌మాదం.. త‌ప్పిన ప్రాణ న‌ష్టం

ఓ గోదాంలో అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. భారీగా మంట‌లు ఎగిసిప‌డ‌టంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ సంఘ‌ట‌న మహారాష్ట్రలోని పుణె నగరంలో చోటు చేసుకుంది. గంగధామ్‌ ఏరియాలోని ఓ గోదాంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గోదాం సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఫైరింజన్‌ల సాయంతో మంటలను ఆర్పేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదన్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement