Sunday, April 28, 2024

టీ పొడి కల్తీపై సీరియస్.. పోలీసు స్పెషల్ టీమ్స్ రంగంలోకి..

సూర్యాపేట, ప్ర‌భ‌న్యూస్: కల్తీ వ్యాపారాలపై ఉక్కుపాదం మోపుతామని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. నిన్న జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించా రు. పట్టణంలో ప్రాణాంతకమైన కల్తీ టీ- పొడి విక్రయిస్తున్నారన్న సమాచారంతో సూర్యాపేట పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పట్టణంతో పాటు విజయవాడ, రాజమండ్రి, రావులపాలెంలలో దాడులు చేసి నకిలీ టీ పొడి విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారని తెలిపారు.

సూర్యాపేటలో 45.5 క్వంటాళ్ల కల్తీ టీ-పొడిని, ప్రాణాంతకమైన టార్టాజిన్‌ రసాయన రంగుపొడిని స్వాధీనం చేసుకుని అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్న రాచకొండ అనిల్‌, పోకలరమేష్‌, బూర్ల వినయ్‌ కుమార్‌, తూర్పు గోదావరి జిల్లా, రావులపాలెంకు చెందిన సర్వేమ శ్రీనివాస్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా రాజమండ్రి లోని కృష్ణ చైతన్య, విజయవాడకు చెందిన కామేశ్వరరావు, రాజమండ్రికు చెందిన జగన్నాథం వెంకటరెడ్డి ఇండ్లపై దాడులు చేసి 45.5 క్వింటాళ్ల కల్తీ టీ-పొడి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

నిందితుల నుంచి రెండు కార్లు, 15 సెల్‌ ఫోన్లు, పాత్రలు, గ్యాస్‌ సిలిండర్‌ స్వాధీనం చేసుకున్నామన్నారు. దాడులలో కీలక పాత్ర పోషించిన సిసిఎస్‌ సిఐ నర్సింహ్మచారి, సీఐ ఆంజనేయులు, సిబ్బందిని అభినందించి రివార్డులు అందజేశారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రితి రాజ్‌, డిఎస్పీ మోహన్‌ కుమార్‌, సిఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement