Thursday, December 7, 2023

Revenge Politics – ఉమ్మ‌డి రాష్ట్రంలో సైతం ఇంత అవ‌మానం జ‌ర‌గ‌లా… స్పీక‌ర్ పై ఈట‌ల మండిపాటు..

హైద‌రాబాద్ – తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) భేటీకి తమను ఆహ్వానించలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. గతంలో ఏదైనా పార్టీకి ఒక్క ఎమ్మెల్యే ఉన్నా సరే బీఏసీ మీటింగ్‌కు పిలిచేవారని అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ సమైక్య పాలకులకు ఉన్న సోయి తెలంగాణ పాలకులకు లేదని మండిపడ్డారు.

అసెంబ్లీలో బీజేపీకి ముగ్గురు సభ్యులు ఉన్నారని, అయినా తమను బీఏసీ సమావేశానికి పిలవలేదని చెప్పారు. అసెంబ్లీలో చాలా గదులు ఖాళీగా ఉన్నా సరే తమకు ఆఫీసు గది కేటాయించలేదని తెలిపారు. ఇది కక్ష సాధింపేనని ఆరోపించారు. ఇదే అంశంపై స్పీకర్‌‌కు ఫోన్ చేసి అడిగినా సమాధానం లేదని వాపోయారు. స్పీక‌ర్ వైఖ‌రిని ఈట‌ల త‌ప్పుప‌ట్టారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement