Wednesday, October 2, 2024

TS: సీఎం కేసీఆర్ ను కలిసిన ప్రభుత్వ విప్ గోవర్ధన్…

బిక్కనూర్, ఆగస్టు 3 ప్రభ న్యూస్…. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావును కామారెడ్డి ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ గురువారం కలిశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా గోవర్ధన్ సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. అనంతరం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలను గోవర్ధన్ సీఎంకు వివరించారు.

నియోజకవర్గ అభివృద్ధికి కావలసిన నిధులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా గోవర్ధన్ కోరారు. సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఆయన వెంట రాష్ట్ర రోడ్డు భవనాల శాఖమంత్రి ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, జుక్కల్, ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, షకిల్, జీవన్ రెడ్డి, హనుమంత్ షిండే, ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement