Saturday, April 27, 2024

Chit Chat – మీడియా ఆధారాలతో వార్తలు ఇస్తే…త‌ప్పుల‌ను స‌రిదిద్దుకుంటాం – రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – ప్ర‌భుత్వంలోని లోటుపాట్ల‌ను,ఇత‌ర సామాజిక స‌మ‌స్య‌ల‌పై ఆధార‌ల‌తో మీడియా వార్తలు రూపంలో ఇచ్చిన‌ట్ల‌యితే తాము త‌ప్పుల‌ను సరిదిద్దుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్ది అన్నారు..సీఎం మీడియాతో నేడు మీడియాతో చిట్ చాట్ చేస్తూ.. ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని ఖాళీ స్థలాన్ని అవసరాల కోసం వినియోగించుకుంటామని తెలిపారు. ప్రజాభవన్ లో ఉన్న ఆఫీసు కార్యాలయాన్ని ఉపయోగించుకుంటాన‌ని పేర్కొన్నారు.. . మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీ)లోని ఖాళీ స్థలాన్ని ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించుకుంటామని తెలిపారు. రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టుకు మెట్రో ఉపయోగకరంగా ఉండదని, మరో రూట్‌లో మెట్రో ప్లాన్‌ చేస్తామని సీఎం వెల్లడించారు.

కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించబోమ‌ని, .. శాసన సభ భవనాలను సమర్థంగా వాడుకుంటామని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ ను కేవలం 12, 13 గంటలకు మించి ఇవ్వలేదు అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శ్వేత పత్రాలు సహా అన్ని అంశాలపై అందరితో చర్చించి సమయం వచ్చినప్పుడు విడుదల చేస్తామని వెల్లడించారు. రేపు బీఏసీ సమావేశం ఉంటుంద‌ని, శాసన సభ సమావేశాల ఎజెండాపై నిర్ణయం తీసుకుంటామ‌న్నారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసే ప్రసక్తే లేదు అని తేల్చేశారు..
అధికారుల నియామకంలో పైరవీలు ఉండ‌వ‌ని చెప్పారు. సీపీలు ఎవరు కూడా పోస్టింగ్ ల కోసం త‌న‌ను అడగలేదు అని తెలిపారు. అధికారుల హంటింగ్ ఉండద‌ని, అయితే అధికారుల బదిలీలు ఉంటాయి కానీ వెంటపడం అని సీఎం పేర్కొన్నారు. అసెంబ్లీ, కౌన్సిల్ భవనాలు కలిసి ఉండాలి అనేది మా ఆలోచన అని, .. జూబ్లీహాల్ కి మరిన్ని హంగులు దిద్దుతామని తెలిపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement