Thursday, May 2, 2024

భూమ్.​. భూమ్​: భూముల రేట్లు డబుల్​.. గజం ధర 20వేల నుంచి 40 వేలకు..

పట్టణీకరణ, జాతీయ రహదారులకు ఇరువైపులా ఉండి, మౌలిక వసతులు ఇతోధికంగా పెరిగిన ప్రాంతాల్లో
మార్కెట్ విలువలు మెచ్చుగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రియల్‌ ఎస్టేట్‌ శరవేగంగా పరుగులు పెడుతున్న ప్రాంతాలు, పలు పరిశ్రమలు, ఐటీ సెక్టార్‌, ఇతరత్రా అభివృద్ధి వసతులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ప్రత్యేకంగా పరిగణించారు. వ్యవసాయ భూములను రాష్ట్ర వ్యాప్తంగా 50 శాతంపైగా పెంచుతూ మార్కెట్ విలువలను స్థిరీకరించారు. అగ్రగామి ప్రాంతాలుగా పరిగణించిన పలు
ప్రాంతాల్లో 25శాతం నుంచి 100శాతంగా పెంపుదల వర్తింపజేశారు. ఇందుకు అనేక అంశాలను ప్రభుత్వం ప్రాతిపదికగా తీసుకుంది ప్రభుత్వ మార్కెట్ విలువలకు రెండు మూడు రెట్లు అధికంగా రిజిస్ట్రేషన్లు
జరుగుతున్న ప్రాంతాలను ప్రాధాన్యత కల్గిన ప్రాంతాలుగా గుర్తించారు. వాణిజ్య భవనాలకు అన్ని అంతస్తులకు ఒకే ధరను నిర్ణయించారు. ఏయే ప్రాంతాల్లో లావాదేవీలు ఎక్కువగా జరగుతున్నాయో లెక్కలు తీసి ధరలను ఖరారు చేశారు.

ఇలా అగ్రగామి ప్రాంతాల్లో ధరలు కొంత ఎక్కువ మొత్తంలో పెరిగాయి. మియాపూర్‌లో ప్రస్తుతం మార్కెట్ విలువ ధర గజానికి రూ.39 వేలు ఉన్న స్థానంలో రూ.1,60,000లకు పెరిగింది. శంషాబాద్‌లో రూ.7,500 నుంచి రూ.50 వేల వరకు పెంచుతూ నిర్ణయించారు. సైనిక్‌పురిలో రూ.39 వేల నుంచి రూ.1.20 లక్షలకు, బోడుప్పల్‌లో రూ.10,500ల నుంచి రూ.50 వేలకు, మణికొండలో రూ.17 వేల నుంచి రూ.70 వేలకు, గచ్చిబౌలిలో రూ.39 వేల నుంచి రూ.1.60 లక్షలకు మార్కెట్ విలువలను చదరపు గజానికి పెంచుతూ రేట్లు ఫిక్స్‌ చేశారు.

వ్యవసాయ భూముల ధరలు కూడా ప్రాంతాలను, అభివృద్ధి ఏరియాలు, జిల్లా, మండల, రెవెన్యూ డివిజన్‌
కేంద్రాలు, పట్టణాలు, నగరాలు, శివారు ప్రాంతాలు, ఐటీ, ఇతర పరిశ్రమలు, రహదారులు, మౌలిక వసతులు వంటి అనేక అంశాల ఆధారంగా మార్కెట్ విలువలను నిర్దారించారు. ఇందుకు రిజిస్ట్రేషన్లు జరిగిన తీరును, చేతులు మారిన భూ క్రయవిక్రయాలను పరిశీలించారు. 25నుంచి 100శాతం పెరిగిన
వ్యవసాయ భూముల ధరల్లో 25నుంచి 100శాతం వరకు ధరలు పెరిగాయి. ఇందులో రాష్ట్రంలోని 472
గ్రామాల్లో 10రెట్లు, 90 గ్రామాల్లో 15రెట్లు, 77 గ్రామాల్లో 20రెట్లు ధరలు పెరిగాయి. 42 గ్రామాల్లో 20రెట్లకు
మించి 150శాతం మార్కెట్ ద‌ర‌లు పెరిగాయి.

ఒకట్రెండు రోజులుసేవలు బంద్ ..

ఈ తాజా ఉత్తర్వులు ఫిబ్రవరి1నుంచి అమలులోకి రానున్నాయి. ఇందు కు వీలుగా ధరణి, ఐజీఆర్‌ఎస్‌
వెబ్‌సైట్లలో మార్పులు, చేర్పులు చేస్తున్నా రు. అయితే ఒకరోజు సెలవు దినంగా క్రయ విక్రయాల
రిజి స్ట్రేషన్లను నిలుపుదల చేసి ట్రయల్‌ నిర్వహించనున్నారు. ఇందుకుగానూ ముందస్తుగా ప్రభుత్వం ప్రకటన చేయనుంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement