Monday, April 29, 2024

విస్తారంగా వర్షాలు – అప్రమత్తంగా ఉండండి – సీఐ ప్రతాప్ లింగం

షాద్ నగర్ ప్రభ న్యూస్ జూలై 20 గత రెండు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల పట్ల ప్రకృతి వైపరీత్యాల పై ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా ఇబ్బందులు కలిగితే వెంటనే 100 డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ ఇన్స్పెక్టర్ ప్రతాప్ లింగం సూచించారు. విస్తృతంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లే అవకాశం ఉందని అదేవిధంగా రోడ్లపై ఎక్కడైనా వాహనాలు ఆగిపోయినా ఇంకా ఇతర ప్రమాదాలు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందజేయాలని చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరే అవకాశం ఉంటుంది కాబట్టి మున్సిపల్ శాఖ కమిషనర్ వెంకన్నతో మాట్లాడినట్టు ఆయన పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో ప్రజలను సకాలంలో ఆదుకునేందుకు మున్సిపల్ శాఖతో కలిసి పట్టణంలో సత్వరమే స్పందించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పోలీసు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావద్దని రోడ్లపై డ్రైనేజీ కాలువల గట్లపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాల సమస్యలపై పోలీసులను ఆశ్రయించ వచ్చని ప్రజలు ప్రమాదాల బారిన పడవద్దని సూచించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement