Saturday, April 27, 2024

RR: సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి..సీఐ టంగుటూరి శీను

వికారాబాద్ టౌన్ జనవరి 8 ( ప్రభన్యూస్): 6 గ్యారంటీల పేరుతో సైబర్ నేరగాళ్లు విరుచుకుపడే అవకాశం లేకపోలేదు ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సీఐ టంగుటూరి శీను సూచించారు. ఎవరు ఫోన్ చేసి ఓటీపీల పేరుతో మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసిన ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీలు చెప్పకూడదని, ఆరు గ్యారెంటీలు అప్లై చేసిన ప్రజలకు తెలిపారు.

గ్యారంటీల పేరుతో సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉందని, గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఓటిపి అడిగితే చెప్పొద్ద‌న్నారు. సీజన్ బట్టి సైబర్ మోసగాళ్లు కొత్త కొత్త మోసాలకు తెరలేపుతుంటారని, దరఖాసుదారులకు ప్రభుత్వ నుండి ఎలాంటి ఓటీపీలు రావు కాబట్టి ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అదేవిధంగా చిన్నపిల్లలకి ఫోన్లు ఇవ్వకూడదు ఫేక్ మెసేజ్ లని ఓపెన్ చేయకూడదు అని వికారాబాద్ పట్టణ సీఐ టంగుటూరి శీను ప్రజలకు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement