Saturday, May 18, 2024

TS : ఎల్ఆర్ఎస్​ను రద్దు చేయాలి… మాజీ ఎమ్మెల్యే ఆనంద్

వికారాబాద్, మార్చి 6 (ప్రభ న్యూస్): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్​ఆర్​ఎస్​ను రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ మాట్లాడుతూ గతంలో ఎల్లారీస్ ను వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఎలా అమలు చేస్తుందని ప్రశ్నించారు. ఈ కార్య‌క్ర‌మంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు అనంతరెడ్డి, గోపాల్, కొండేటి కృష్ణ, వికారాబాద్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, నాయకులు విజయ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, ఇబ్బనూర్ శ్రీకాంత్ రెడ్డి ,అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement