Sunday, May 5, 2024

డాక్టర్ నళిని చౌదరి -వైద్యరంగంలో అందిస్తున్న విశిష్ట సేవలకు ఎన్నో అవార్డులు…

తోర్రూర్ రూర‌ల్ ప్రభన్యూస్ : నిరుపేదలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో తెలంగాణ న్యూరో సెంటర్ ను ఏర్పాటు చేసి గత 21 సంవత్సరాలుగా తన సేవలతో చెరగని ముద్ర వేసుకున్నారు డాక్టర్ నళిని చౌదరి. ఇప్పటికీ తన సేవలతో అవిశ్రాంతంగా ప్రజల కోసమే పరితపిస్తున్నారు.పేదల పెన్నిధిగా గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న పేద ప్రజలకు పరీక్షలు నిర్వహించి, సకాలంలో వైద్య సేవలందించి ఉన్నతాశయంతో ఆయన కృషి చేస్తున్నారు. ప్రణాళికా బద్ధంగా పరిసర గ్రామాల్లో పేద,మధ్యతరగతి గ్రామీణ, పట్టణ ప్రజలకు వైద్య శిబిరాలు నిర్వహించి, ప్రాధమిక పరీక్షలు చేసి ..రోగులకు సూచనలిస్తూ వైద్య సేవలు అందిస్తున్నారాయ‌న‌.

తెలంగాణలో ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ వైద్యులు డాక్టర్ నళిని చౌదరి హన్మకొండ కొత్త బస్టాండ్ పద్మాక్షి గుడి రోడ్ లో న్యూరో సెంటర్ ద్వారా జిల్లా కేంద్రంగా ఆయన చేస్తున్న వైద్య సేవలను గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి అవార్డులు, ప్రశంసల తో సత్కరించాయి.దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వైద్య రంగంలోని కొన్ని సంస్థలు డాక్టర్ చౌదరి సేవలను అభినందిస్తూ అసోసియేషన్ల ద్వారా ఆయనను ఘనంగా సత్కరించాయి.

ఆయ‌న‌కి వ‌చ్చిన‌..అందుకున్న అవార్డులు, సత్కారాలు ఇవే..
-2017 సంవత్సరంలో ఫెలోషిప్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా సంస్థ డాక్టర్ నళిని చౌదరి సేవలను గుర్తించి ఘనంగా సత్కరించింది.
-2019 సంవత్సరంలో ఫెలోషిప్ ఆఫ్ ఇండియన్ అకాడమీ విత్ ఆఫ్ న్యూరాలజీ సంస్థ డాక్టర్ చౌదరి ఘనంగా సత్కరించింది.
-2021 సంవత్సరం లో ఫెలోషిప్ ఆఫ్ అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరోలాజీ(ఎఫ్ఎఎఎన్) డాక్టర్ నళిని చౌదరి సేవలకు గుర్తింపుగా అవార్డును ఇచ్చింది. -అమెరికాకు చెందిన ఫాన్ డాక్టర్ నళిని చౌదరి వైద్య రంగంలో అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మకమైన అవార్డును ఇచ్చి ఘనంగా సత్కరించింది.

డాక్టర్ నళిని చౌదరి పేద,మధ్యతరగతి, గ్రామీణ, పట్టణ ప్రజలకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఫాన్ అవార్డు బహుకరణ చేసింది.వరంగల్ జిల్లాలోని ఇలాంటి అరుదైన గౌరవాన్ని అందుకున్న మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ నళిని చౌదరి కావడం విశేషం.పాన్ అవార్డు ను ఆయన వైద్య రంగంలో అందిస్తున్న విశిష్ట సేవలను పరిగణలోకి తీసుకోవడమే కాకుండా వారిలోని నాయకత్వ లక్షణాలు,అంకితభావం,వృత్తి నిబద్ధత, ఆయనకు సమాజంలో ఉన్న గౌరవం, విభిన్నత, సామాజిక న్యాయం అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ అవార్డుకు ఎంపిక చేసింది.వృత్తి నిబద్ధతను ముందుకు తీసుకు వెళ్లడంలో నళిని చౌదరి సేవలను ఫాన్ గుర్తించింది.నళిని చౌదరి సామాజిక సేవ చేస్తున్న తీరును ప్రతిఒక్కరు అభినందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement