Sunday, May 5, 2024

మంచినీటి సమస్యలు పరిష్కరిస్తాం..

ఘట్‌కేసర్‌ : ఘట్‌కేసర్‌ మున్సిపల్‌ ప్రాంతంలో మంచినీటి సమస్యలు తలెత్తకుండా పరిష్కరించుటకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ ముల్లి పావని జంగయ్యయాదవ్‌ అన్నారు. మున్సిపల్‌ 1వవార్డు మరియు 8వవార్డులోని పడమటి సాయిగూడెంలో చైర్‌ పర్సన్‌ పావనియాదవ్‌ కౌన్సిలర్‌లతో కలసి పర్యటించారు. ఇక్కడ చాలా రోజులుగా ప్రజలు మంచినీటి సమస్యలు ఎదుర్కొంటుండటంతో బోరుబావి వేయించడం జరిగిందని అలాగే నీటి ట్యాంక్‌ను మున్సిపల్‌ కార్మికులతో శుభ్రం చేయించడం జరిగిందని చైర్‌ పర్సన్‌ పావని తెలిపారు. ఈకార్యక్రమంలో 1వవార్డు కౌన్సిలర్‌ చందుపట్ల వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపిటీసీ చిలుకూరి గోపాల్‌రెడ్డి, ఇంచార్జీ రాకేష్‌, మున్సిపల్‌ కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement