Sunday, May 5, 2024

తమ్ముడు టైం పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తున్నాడు !!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన మోషన్ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ ను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బల్లెం పట్టుకుని కనిపించారు. ఇక ఆ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది బాస్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement