Wednesday, April 14, 2021

ఆపదలో అండగా సీఎంఆర్‌ఎఫ్..

తాండూరు : ఆపదలో ఉన్న పేదలకు సీఎంఆర్‌ఎఫ్‌(సీఎం సహాయనిధి) అండగా నిలుస్తోందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. తాండూరు మండలం 22వ వార్డుకు చెందిన టైలర్‌ అబ్దుల్‌ సమద్‌కు ప్రభుత్వం సీఎం ఆర్‌ఎఫ్‌ కింద మంజూరు చేసిన రూ. 2లక్షల ఎల్‌ఓసీని ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో ఆపదలో ఉన్న బాధితులు సీఎంఆర్‌ఎఫ్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సహాకార సంఘం డైరెక్టర్‌ రవీందర్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటి మాజీ చైర్మన్‌ వడ్డె శ్రీనివాస్‌, వార్డు కౌన్సిలర్‌ రాము ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News