Monday, May 6, 2024

వాగులో కారు గల్లంతు.. క్షేమంగా బ‌య‌ట‌ప‌ట్ట దంపతులు..

తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో నాగారం వాగులో కారు కొట్టుకుపోయింది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కారు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తున్న భార్యాభ‌ర్త‌లు చెట్టును పట్టుకొని క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు. కాగా కారు వరదలో కొట్టుకుపోయిన‌ సమాచారం అందుకున్న పోలీసులు జేసీబీ సాయంతో కారుని బయటకు తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement