Thursday, April 25, 2024

వ‌సూళ్ల‌తో దూసుకుపోతోన్న గాడ్ ఫాద‌ర్-ఫ‌స్ట్ డే కలెక్ష‌న్స్ రూ.38కోట్లు

వ‌సూళ్ల‌తో దూసుకుపోతోంది మెగాస్టార్ చిరంజీవి న‌టించిన గాడ్ ఫాద‌ర్ చిత్రం. చిరంజీవి చేసిన రెగ్యులర్ సినిమా కాదని ఆడియన్స్ ను ముందుగానే ప్రిపేర్ చేయడం వలన, వాళ్లంతా కేవలం కంటెంట్ పై ఆసక్తితోనే థియేటర్స్ కి రావడంతో వాళ్లను ఈ సినిమా ఆకట్టుకుంది. ఇక తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ఆరోప్రాణమని చిరంజీవినే చెప్పారు. సినిమా చూస్తున్నప్పుడు అది నిజమేనని అనిపిస్తుంది. ఈ దసరా సెలవుల్లో ఈ సినిమా ఎంత రాబడుతుందనేది చూడాలి.ఇది మ‌ల‌యాళ చిత్రం లూసిఫ‌ర్ కి రీమేక్ గా తెర‌కెక్కింది . ఎన్వీ ప్రసాద్ – ఆర్ బి చౌదరి నిర్మించిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లనే రాబట్టింది. తొలి రోజునే ఈ సినిమా 38 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టడం విశేషం. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. చిరంజీవి పాత్రలోని నిబ్బరం ..హీరోయిన్ నయనతార పాత్రలోని నిండుదనం .. సత్యదేవ్ పాత్రలోని స్వార్థం .. సముద్రఖని పాత్రలోని స్త్రీ వ్యామోహం .. ఇలా ప్రతి పాత్రను మోహన్ రాజా తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement