Thursday, April 25, 2024

Bharat Jodo Yatra : తల్లిపై రాహుల్ గాంధీ ప్రేమ… నెట్టింట వైర‌ల‌వుతున్న ఫొటో..

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో సోనియా గాంధీ పాల్గొన్నారు. పాదయాత్ర చేస్తోండగా సోనియాగాంధీ షూ లేస్ ఊడిపోయింది. దీన్ని గమనించిన రాహుల్ గాంధీ షూ లేస్ కట్టారు. ఈ ఫొటోను కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఆ వెంటనే అది వైరల్‌గా మారింది. కాగా రాహుల్ గాంధీ.. ఎక్కువ సేపు సోనియాను నడవనివ్వలేదు. ఆమె ఆరోగ్య ప‌రిస్థితిని దృష్టిలో పెట్టుకుని కొద్దిదూరం వెళ్లిన తరువాత ఆమెను కారులో బ‌ల‌వంతంగానే కూర్చోబెట్టారు. ఇదిలా ఉండ‌గా.. ఇదివరకు మైసూరులో రాహుల్ గాంధీ నిర్వహించిన బహిరంగ సభ.. నెటిజన్లను ఆకట్టుకుంది. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆయన చేసిన ప్రసంగానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పుడు తాజాగా త‌ల్లికి రాహుల్ గాంధీ షూ లేస్ క‌ట్టిన ఫొటో మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

https://twitter.com/politics_2019__/status/1577872127369572352
Advertisement

తాజా వార్తలు

Advertisement