Thursday, May 2, 2024

హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. కుండపోతకి పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు..

వాతావరణ శాఖ సూచించినట్లుగానే నగరంలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. కూకట్​పల్లి, కేపీహెచ్​బీ కాలనీ, ఆల్విన్​కాలనీ, బంజారాహిల్స్​, జూబ్లిహిల్స్, పంజాగుట్ట, సికింద్రాబాద్, మియాపూర్, మెహిదీపట్నం, జీడిమెట్ల, మాదాపూర్, గచ్చిబౌలి, గాజుల రామారం, దిల్ సుక్ నగర్, మణికొండ, ఎల్బీ నగర్, చింతల్ తోపాటు ప‌లు ప్రాంతాల్లో మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షం కురుస్తోంది. ప‌లు చోట్ల‌ ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై మ్యాన్​హోల్స్​ పొంగిపొర్లుతున్నాయి. నగరంలోని పలు ప్రధాప కూడలల్లో ట్రాఫిక్ స్థంభించడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. వెంటనే అప్రమత్తమైన డీఆర్ ఎఫ్, మాన్సూన్ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement