యాచారం : యాచారం మండలంలో పశుగ్రాసం లేక రైతన్నలు తల్లడిల్లిపోతున్నారు. గతేడాది వర్షాలు పుష్కలంగా కురిసిన పశుగ్రాసానికి మాత్రం కొరత ఉందని చెప్పాలి. రైతులు పండించిన వరి పంటను కూలీల ద్వారా కాకుండా వరి కొత యంత్రాలతో కోపిస్తుండటం వల్ల పశుగ్రాసం చేతికి అందకుండా పోతుంది. దాని వల్ల సగం పశుగ్రాసం నేలపాలవుతుంది. నల్గోండ జిల్లా ఆంధ్ర బార్డర్ నుండి పశుగ్రాసాలని లారీలలో నింపుకోని ఈ ప్రాంతాలకు తీసుకు వచ్చి అమ్ముకుంటున్నారు. దీంతో పశుగ్రాసం ధర ఒక్కసారిగా ఆకాశన్ని అంటుంది. రైతన్నలు పశుగ్రాసం లేక పాడి పశువుల కోసం వేల రూపాయలు ఖర్చు చేసి కొనే పరిస్థితి నెలకొంది. లారీ లోడ్ పశుగ్రాసం ధర రూ. 30వేల నుంచి రూ. 35వేల వరకు అమ్ముకుంటు సోమ్ము చేసుకుంటున్నారు. కావున రైతన్నలను దృష్టిలో ఉంచుకోని ప్రభుత్వం కల్పించుకోని సబ్సిడిలో పశుగ్రాసాన్ని అందించాల్సిన అవసరం ఎంతైన ఉంది. ఈ వేసవి కాలంలో పశువులను దక్కించుకునేందుకు రైతన్నలు నానా తంటాలు పడి అప్పులు చేసి పశుగ్రాసాన్ని కోనుగోలు చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement